మీరు డిగ్రీ పాస్ అయ్యారా..?? సమాజం మీద అవగాహన ఉందా...?? భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలపై అక్కడి సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల నిర్మూలనకి చేపట్టాల్సిన చర్యలని బేరీజు వేయగాలారా అయితే మీకు sbi ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. “ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్” ని ప్రకటించింది. కార్పోరేట్ రెస్పాన్స్బిలిటీ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

IHG

ఈ ఫెలోషిప్ పై ఆసక్తి ఉన్నవారు అప్ప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ ఫెలోషిప్ కి ఎంపిక అయిన వారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంభందించి 13 నెలల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ సమయంలో గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్లి అక్కడి సమస్యలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎంపిక అయిన వారికి పలు స్వచ్చంద సంస్థలు నిపులు సహాకారాన్ని కూడా అందిస్తారు.

IHG

ఇప్పటికే ఈ కోర్సు పూర్తి చేసిన వారు సుమారు 300 మంది వివిధ గ్రామాలలో వారి సేవలని అందిస్తున్నారు. దేశం మొత్తంలో 99 గ్రామాలలో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. 10 NGO లు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఫెలోషిప్ పై ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలోకి వెళ్తే...

 

ఫెలోషిప్ కాల వ్యవధి : 13 నెలలు

 

అర్హత : 2020 ఆగస్ట్ నాటికి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. కేవలం విద్యార్ధులు మాత్రమే కాదు ఉద్యోగులు సైతం ఈ ఫెలోషిప్ కి అప్ప్లై చేసుకోవచ్చు.

 

వయసు : ఆగస్టు 2020 కి 21 -32 ఏళ్ళ మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం : వృత్తి, వివిధ వ్యక్తిగత నేపధ్యాలని బేరీజు వేసుకుని ఎంపిక చేస్తారు.

 

ఈ కోర్సు రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

https://register.you4.in/

 

ఈ కోర్సుకి సంభందించి మరిన్ని వివరాలకోసం

https://youthforindia.org/

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: