ఉద్యోగం లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు.. ఉన్న‌దంతా చ‌దువుల‌కే పెట్టి ఉద్యోగం దొర‌క‌క రోడ్డున ప‌డుతున్న వారు.. నేటి స‌మాజంలో ఎంద‌రో ఉన్నారు. అలాగే నాలుగేండ్ల పాటు బీటెక్​ చదివినా.. ఉపాధి దొర‌క‌క ఎంతోకొంత‌ శాలరీ వస్తే చాలనుకుని చిన్న చిన్న ఉద్యోగాల‌పై దృష్టి పెడుతున్నారు. అలాగే ఇప్పుడు ప‌రిస్థితులు బ‌ట్టీ చూస్తే.. చేతులో డిగ్రీ ప‌ట్టా ఉన్నా క‌నీస ఉద్యోగం దొర‌క్క‌పోవ‌డంతో కొంద‌రు విల‌విల‌లాడుతున్నారు. అయితే ఇలాంటి వారింద‌రికీ ఓ గుడ్ న్యూస్‌. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 

 

మొత్తం 307 ఖాళీలను ప్రకటించింది. ఇవన్నీ ట్రైనీ పోస్టులే. డ్రాగ్‌లైన్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి.  మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాల్లో గల ఓపెన్ క్యాస్ట్ మైన్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 30 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మ‌రియు ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్ధులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

 

పోస్టుల వివ‌రాలు ప‌రిశీలిస్తే..
మొత్తం ఖాళీలు (ట్రైనీ)- 307
డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)- 167షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28
పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 6
క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)- 21

 

డ్రాగ్‌లైన్ ఆపరేటర్ (ట్రైనీ)- 9
డ్రిల్ ఆపరేటర్ (ట్రైనీ)- 17
డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)- 48
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 11

 

అర్హతలు- ఎస్ఎస్‌సీ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఈ, హెచ్ఎంవీ లైసెన్స్ తప్పనిసరి.
వయస్సు- 2020 మార్చి 16 నుంచి మార్చి 30
దరఖాస్తు ప్రారంభ తేది- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 30

మరింత సమాచారం తెలుసుకోండి: