టెన్త్‌ పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు సోమవారం స్ప‌ష్టం చేసింది. కరోనా నేపథ్యంలో పది పరీక్షలు వాయిదా వేయాలని ఉపాధ్యాయుదు బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేమని ఈ సందర్భంగా రాష్ట్ర ‍ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభిప్రాయంపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేర‌కు ప్రస్తుతం ఉన్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితులను బట్టి తమ నిర్ణయం చెప్తామని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ మేరకు భార‌త్‌లో క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ. సత్యనారాయణ రెడ్డి వెల్ల‌డించారు. వాయిదా ప‌డిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌తోపాటు అన్ని ఇత‌ర ప‌రీక్ష‌ల రీ షెడ్యూల్ తేదీల‌ను త‌ర్వ‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. 

 

అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ లాక్‌డౌన్  కొన‌సాగుతున్న నేప‌థ్యంలో నిర్వ‌హ‌ణ అసాధ్య‌మ‌ని భావించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఈమేర‌కు కోర్టుకు సూచించింది. కోర్టు కూడా సానుకూలంగా స్పందించ‌డంతో మరోసారి వాయిదా తప్పలేదు.  తెలంగాణ‌లో క‌రోనా కేసులు సోమ‌వారం నాటికి 70కి పైగా న‌మోద‌య్యాయి.ఇక భార‌త్‌లోనూ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి.  సోమ‌వారం ఉద‌యం నాటికి దేశంలో 1074 కేసులు న‌మోదుకావ‌డం భ‌యాందోళ‌న‌ల‌ను రేకెత్తిస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: