ఉన్నత చదువులు అభ్యసించి కూడా ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ అందించింది oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL. oil CORPORATION LIMITED' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తుందన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ https://www.iocl.com/ ఫాలో అవ్వండి. త్వరలో పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. అంతే అతి త్వరలోనే డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక అర్హత గల అభ్యర్థులు పైన చెప్పిన వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత విషయానికి వస్తే.. 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50% మార్కులతో పాస్ కావాలి. సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఫైనాన్స్ / అకౌంట్స్ / ట్యాక్సేషన్ / కాస్ట్ అకౌంటింగ్ / ఆడిటింగ్ లాంటి అంశాల్లో అనుభవం కూడా ఉండాలి. ఇక అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.