డిగ్రీ పాస్ అయ్యారా..? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్‌. వాస్త‌వానికి నేటి స‌మాజంలో డిగ్రీ ప‌ట్టా చేతిలో ఉన్నా ఉద్యోగం దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అలాంటి వారింద‌రికి శుభ‌వార్త చెప్పింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ 2020 లో భాగంగా 4వ బ్యాచ్‌కు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అయితే ప్ర‌స్తుతానికి ఎన్ని పోస్టులు అనేది వెల్ల‌డించ‌లేదు.  సెప్టెంబర్‌లో 4వ బ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌లో క్లాస్‌రూమ్ ట్రైనింగ్‌తో పాటు జాబ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మణిపాల్ యూనివర్సిటీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది ప్రొఫెషనల్ డిప్లొమా ప్రోగ్రామ్ అందిస్తోంది. ఇందులో మొదటి ఆరు నెలలు పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తుంది. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. 2019 జూన్ 1 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. 

 

ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు  https://futurebankers.myamcat.com/ ఈ  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక  2020 ఏప్రిల్ 30 దరఖాస్తుకు చివరి తేదీ. 21 నుంచి 26 ఏళ్లు వ‌య‌స్సు ఉండాలి. ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి జాయినింగ్ సమయంలోనే బెంగళూరులోని మణిపాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జాబ్ ఆఫర్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: