మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అక్క‌డా, ఇక్క‌డా తిరిగి అల‌సిపోయారా..? అయితే మీకో గుడ్ న్యూస్‌. భారత ప్రభుత్వానికి చెందిన హైట్స్-హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ నిరుద్యోగుల‌కు తీపు క‌బురు అందించింది. మొత్తం 101 ఖాళీలున్నాయి. సైట్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులు, డివిజన్లు, ప్రాజెక్టుల్లో వీరిని నియమించనుంది. 

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hllhites.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 28 చివరి తేదీ. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. ఈ మంచి అవ‌కాశాన్ని అస్స‌లు మిస్ చేయ‌కండి. 

 

ఇక పోస్టుల ఖాళీల‌ను ప‌రిశీలిస్తే..
మొత్తం ఖాళీలు- 101
డ్రాఫ్ట్స్‌మ్యాన్- 2
సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 4
అకౌంట్ ఆఫీసర్- 5
సైట్ ఇంజనీర్- 7
సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్- 2

 

టెక్నీషియన్- 2
ఎంఐఎస్ ఎగ్జిక్యూటీవ్- 1
టెక్నికల్ అనలిస్ట్- 2
ఆఫీస్ బాయ్- 1
మేనేజర్ / డిప్యూటీ మేనేజర్- 16

 

టెస్ట్ ఇంజనీర్- 3
అకౌంట్ అసిస్టెంట్- 5జూనియర్ అకౌంట్ అసిస్టెంట్- 5
డిప్యూటీ మేనేజర్ / అసిస్టెంట్ మేనేజర్- 2
జూనియర్ ఆర్కిటెక్ట్- 4
బయో మెడికల్ ఇంజనీర్- 6
అసిస్టెంట్ మేనేజర్- 2

 

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (సివిల్)- 4
డిప్యూటీ జనరల్ మేనేజర్- 4
చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్)- 2
సీనియర్ మేనేజర్- 8
ప్రాజెక్ట్ మేనేజర్- 2
ప్రాజెక్ట్ ఇంజనీర్- 13
మేనేజర్- 5

మరింత సమాచారం తెలుసుకోండి: