మీకు IT ఉద్యోగం మీ కలా? సాఫ్ట్‌ వేర్ రంగంలో దూసుకపోవలనుకుంటున్నారా? ఈ ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నారా...? అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - tcs కంపెనీ అందిస్తున్న ఉచిత కోర్సు కెరీర్ ఎడ్జ్ గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి. లాక్‌ డౌన్‌ సమయంలో ఇంట్లో ఉంటున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగం కోరుకునేవారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - tcs కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. కేవలం 15 రోజుల డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను tcs ఉచితంగా అందిస్తోంది.

 

 

tcs కు చెందిన ION డిజిటల్ లెర్నింగ్ హబ్ ప్లాట్‌ ఫామ్ అందిస్తున్న కోర్సు ఇది. ఈ కోర్సు యొక్క పేరు "కెరీర్ ఎడ్జ్". ముఖ్యంగా ఇది కాలేజీ విద్యార్థులు, ఉద్యోగుల కోసం రూపొందించిన కోర్సు ఇది. లాక్‌ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఈ కోర్సుని చాలా సులువుగా పూర్తి చేయొచ్చు. ఈ కోర్స్ లో నానో వీడియోస్, కేస్ స్టడీస్, అసెస్మెంట్స్ ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ బలాలు, బలహీనతల్ని పూర్తిగా వారి పరిస్థితి తెలుసుకోవచ్చు. tcs నిపుణులు నిర్వహించిన రికార్డెడ్ వెబినార్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

 

 

ఈ ప్రోగ్రాం ని ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ టాప్, డెస్క్‌ టాప్‌ లో సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కొరకు https://learning.tcsionhub.in/ వెబ్‌ సైట్ ని సంప్రదించండి. కరోనా వైరస్  మహమ్మారి సంక్షోభ కాలంలో tcs ION చేస్తున్న రెండో ప్రయత్నం ఇది. ఇదివరకే tcs 'డిజిటల్ గ్లాస్ రూమ్' పేరుతో వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫామ్‌ ను మొదలు పెట్టింది. ప్రపంచంలోని అన్ని విద్యాసంస్థలు ఉచితంగా వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫామ్‌ ను వాడుకోవచ్చు. అయితే దీని ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు కనెక్ట్ అయ్యి వారి పాఠాలు, అలాగే ఏదైనా సూచనల్ని నేర్చుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: