ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైర‌స్ కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ టైమ్‌లోనే దేశ‌దేశాలు వ్యాపించింది. ముఖ్యంగా క‌రోనా దెబ్బ‌కు పెద్ద‌న్న‌గా చెప్పుకునే ఆగ్ర‌రాజ్యం చిగురుటాకులా వ‌ణికిపోతుంది. మిగిలిన దేశాల‌ది అదే ప‌రిస్థితి అయినా.. అమెరికాతో పోల్చ‌కుంటే క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌ని చెప్పాలి. ఇక ఈ క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌పంచ‌దేశాలు నివార‌ణ‌పై ఫోక‌స్ చేశాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లను వాయిదా పడుతున్నాయి. మ‌రి  ఏఏ నోటిఫికేషన్ల గడువును పొడిగించారో తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డండి. ఇందులో ముందుగా..  విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తును 2020 ఏప్రిల్ 30 వరకు పొడిగించింది హెచ్ఎస్ఎల్.

 

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 93 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా దరఖాస్తు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.

 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 39 కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్, అనలిస్ట్ పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ నియామక ప్రక్రియను వాయిదా వేసింది.

 

బీటెక్ పాసైనవారికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 259 ఖాళీలను ప్రకటించింది. అయితే వాస్తవానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 17న ముగియాల్సి ఉంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మే 17 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: