ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి దేశ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు అబ్బా అంటున్నాయి. దీన్ని నివారించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నాయి. అయితే  కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా  రైల్వే జోన్ల వారీగా తాత్కాలిక పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా  సదరన్ రైల్వే అరక్కోణంలోని డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ హాస్ప‌ట‌ల్ క‌రోనా పేషెంట్ల కోసం కేటాయించారు. 

 

ఇక నోటిఫికేషన్‌లో తాత్కాలికంగా 600 పోస్టుల్ని సదరన్ రైల్వే భర్తీ చేస్తుంది. మొత్తం 600 ఖాళీలు ఉండగా అందులో కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ 72, నర్సింగ్ స్టాఫ్ 120, ల్యాబ్ అసిస్టెంట్ 24, రేడియోగ్రాఫర్ 24, హాస్పిటల్ అటెండెంట్ 120, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ 240 పోస్టులున్నాయి. అయితే ఈ పోస్టులు మూడు నెలల కాంట్రాక్ట్ పోస్టులు. ఇక విద్యార్హతల విష‌యానికి వ‌స్తే కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్‌కు.. ఎంబీబీఎస్ డిగ్రీ, నర్సింగ్ స్టాఫ్.. మూడేళ్ల జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్స్ పాస్ అయ్యి ఉండాలి.

 

రేడియోగ్రాఫర్.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ/ఎక్స్‌రే టెక్నీషియన్/రేడియోడయాగ్నసిస్ టెక్నాలజీ కోర్సు పూర్తి అయ్యి ఉండాలి. హాస్పిటల్ అటెండెంట్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్.. 10వ తరగతి పాస్ కావాలి. ఇక ల్యాబ్ అసిస్టెంట్.. సైన్స్‌లో 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ సర్టిఫికెట్ కూడా ఉండాలి. 

 

అలాగే పూర్తి వివ‌రాల కోసం https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో ప‌రిశీలించ‌వ‌చ్చు. ఇక వేతనాల వివరాలు ప‌రిశీలిస్తే.. కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్- రూ.75000, స్పెషలిస్ట్‌లకు రూ.95000, నర్సింగ్ స్టాఫ్- రూ.44,900, ల్యాబ్ అసిస్టెంట్- రూ.21,700, రేడియోగ్రాఫర్- రూ.29,200, హాస్పిటల్ అటెండెంట్- రూ.18,000, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- రూ.18,000 ప్రకటించింది రైల్వే. సో.. ఆస‌క్తిగ‌త అభ్య‌ర్లు వెంట‌నే అప్లై చేయండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: