బ్యాంకు ఉద్యోగం చాలా మందికి కల. అయితే ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. అందులోనూ బ్యాంకింగ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న‌వారికి మ‌రింత ఉత్సాహాన్ని నింపే విష‌యం. అవును! మీరు అతి త్వ‌ర‌గా బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించే పరీక్షలు రాయండి. ఎందుకంటే.. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్ట స్వతంత్ర సంస్థ ఈ ఐబీపీఎస్.

 

ఇక ప్ర‌స్తుతం స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులతో పాటు రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీలకు రెగ్యులర్‌గా పరీక్షల్ని నిర్వహిస్తుంది.  ఇందులో భాగంగా  అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ విడుదలవుతుంది.  ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది.  వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

 

అలాగే  రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ ఒక‌టి, రెండు, మూడు లాంటి పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. మ‌రియు బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ ఉంటుంది. డిగ్రీ నుంచి పీజీ వరకు పోస్టును బట్టి విద్యార్హతలుంటాయి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులుంటాయి. సో.. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌లు రాస్తే మంచి ఫిల‌తం ఉంటుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: