నేటి స‌మ‌యంలో ఉన్న‌త చ‌దువులు చ‌దివి కూడా నిరుద్యోగులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది. ఇక ఇప్పుడు క‌రోనా వైర‌స్ కార‌ణంగా అన్ని సంస్థ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. మ‌రియు కొన్ని కంపెనీలు క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకుల వ‌ణికిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే న‌ష్టాల‌ను త‌ట్టుకోలేక కొంద‌రు కంపెనీలను సైతం మూసి వేస్తున్నారు. దీంతో ఉద్యోగులు కాస్త నిరుద్యోగులు అవుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్ అందింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 17 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో వెల్లడించింది ఎన్ఎల్‌సీఐఎల్. అయితే క‌రోనా కార‌ణంగా 2020 మే 17 కి ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. మొత్తం 259 ఖాళీలు ఉండగా అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. 

 

అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది. జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల కోసం https://www.nlcindia.com/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. ఇలాంటి మంచి ఛాన్స్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎప్పుడు వ‌స్తుందో.. ఏమో. కాబ‌ట్టి.. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: