కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ వల్ల ఇప్పటికే ప్రపంచం గ‌డ‌గ‌డ‌లాడిపోతుంది. కొన్నివారాల కిందట చైనాను దాటి ఇతర దేశాలకు పాకిన కరోనా మహమ్మారి కొద్దికాలంలోనే లక్షమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. మ‌రోవైపు ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 22 లక్షలకు చేరువయ్యాయి. అయితే ఈ మహమ్మారి వైరస్ నుంచి 5.5 లక్షల మంది కోలుకున్నారు. ఇక అత్యధికంగా అమెరికాలో 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోద‌వ్వ‌డంతో.. అక్క‌డ తీవ్ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లతో పోల్చితే భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువనే చెప్పాలి. 

 

అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డ కేంద్రం క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు లాక్‌డౌన్ కూడా విధించింది. ఈ లాక్‌డౌన్ దెబ్బ‌కు ప‌రీక్ష‌ల‌పై కూడా ప‌డింది. మ‌రియు ఇప్ప‌టికే విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఇక ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ వ‌ల్ల‌ ఇంటర్ ఎగ్జామ్ పేప‌ర్స్ వాల్యుయేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతంద‌న్న విష‌యంపై సందిగ్ద‌త నెల‌కున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు స్ప‌ష్ట‌త ఇచ్చింది. తొలి విడత లాక్‌డౌన్ ముగిశాక మూల్యాంకనం చేపడతారని వార్తలు వచ్చినా.. అలాంటిదేమీ లేదని స్ప‌ష్టం చేసింది.

 

ఈ క్ర‌మంలోనే మే 3 వరకు వాల్యుయేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. అదే నెల 15వ తేదీ నుంచే లాంగ్వేజెస్‌ సబ్జెక్టులు, 19 నుంచి అప్షనల్‌ సబ్జెక్టుల వాల్యువేష‌న్ ప్రారంభమైంది. అయితే కరోనావైరస్ విజృంభన ప్రారంభ‌మ‌వ్వ‌డం..కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించడంతో.. మూల్యాంకనాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు దీనిపై క్వారిటీ ఇస్తూ.. మే 3 వరకు మూల్యాంకనం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: