లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మరియు కాలేజి లు మూతపడ్డాయి. ఇదే మంచి అవకాశం అని పిల్లలు చదువు మానేసి టీవీ లకు అతుక్కుపోతున్నారు. సంవత్సరం అంతా కూడబెట్టుకున్న చదువు లాక్ డౌన్ కారణంగా అటకకేక్కిస్తున్నారు. ఒక విద్య సంవత్సరం కోల్పోతే ఎంత నష్టమో చదువుకొనే పిల్లలకు తెలియక పోవచ్చు కానీ మీకు తెలియంది కాదు. కావున చదువుమీద పట్టు ఉండాలంటే వారిని నిత్యం గైడ్ చేయండి.

 

 

ఎలా చదవాలో నేర్పించండి. కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఎంచుకొని వాటిగురించి తెలుపుతూ రాయమనండి. లేకపోతే న్యూస్ పేపర్ , టెక్స్ట్ బుక్స్  లేకపోతే ఏవేని కథల పుస్తకాలూ చదవమనండి. లేకపోతే ఏదేని వంటగురించి రాయమనండి. ఈలా వారిని చదివిన చదువు మర్చిపోకుండా గుర్తు చేసునేవిధంగా చేయండి .తల్లి తండ్రి కి మించిన గురు ఈ ప్రపంచం లో ఎవరు వుండరు. మీరు తలచుకుంటే ఓ ప్రణాళిక ప్రకారం నేర్పించగలరు. అలాగని 24 గంటలు చదవమంటే వాళ్లకు విసుగు పుడుతుంది కావున రోజుకు ఓ 2 లేక 3 గంటలు మాత్రమే ఈ పని చేయించండి. తద్వారా విద్యా సంస్థలు తెరిచినప్పుడు వారికీ పఠనం చాలా సులభం అవుతుంది...ఎంత నెమరువేస్తె అంత విషయపొందిక ఇది మరచిపోకండి సుమా ...! 

మరింత సమాచారం తెలుసుకోండి: