ఇన్నాళ్లకు.. ఇన్నాళ్లకు ఓ మంచి రాజు వచ్చాడు.. ఇన్నాళ్లు జరిగిన అవినీతి అంత బయట పడుతుంది.. ఒకటి కాదు రెండు కాదు అన్ని సంస్దలలో అక్రమాలు బయటపడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యాబుద్ధులు నేర్పి విద్యర్ధులను సక్రమంగా పెట్టాల్సిన కలశాలలే అక్రమాలకు తెరతీస్తున్నాయి. 

 

IHG

 

లక్షలకు లక్షలు ఫీజులంటూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే నిబంధనలు గాలికి వదిలేసి.. విద్యను వ్యాపారం చేసుకొని.. విద్యార్థులు.. వారి తల్లితండ్రులతో కణ్ణనీళ్ళు పెట్టిస్తున్న కార్పొరేట్, ప్రయివేటు జూనియర్‌ కళాశాలలను గాడిలో పెట్టేందుకు ఆంధ్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

 

IHG

 

ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు, బుక్స్‌ ఇలా అన్ని విషయాల్లో ఇష్టారాజ్యంగా కాకుండా కాలేజీల యాజమాన్యాలకు చెక్ పెట్టడానికి సిద్ధం అయ్యి కొత్త నిర్ణయాలు తీసుకుంది.. అంతే కాదు.. ఇకపై జరిగే అడ్మిషన్లు, అనుమతులను అన్ని కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. 

 

IHG

 

అంతేకాదు.. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషనే నిర్ణయిస్తుంది.. అంటే దీన్ని బట్టి చూస్తే విద్యను వ్యాపారంగా చేసే వ్యాపారులకు చుక్కలు కనిపించనున్నాయి. 2020-2021 విద్యాసంవత్సరం నుండి కాలిజిలకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లు నిర్ణయించింది.. ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే మరో సంవత్సరంలో ఎలా ఉండనుందో.. విద్యను వ్యాపారంగా చేసే వ్యాపారుల సంగతి దేవుడికే తెలియాలి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: