ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్‌ కేసులు 24 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌ర‌ణాల సంఖ్య ల‌క్షా 70 వేలు దాటింది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వాల‌కు మ‌రింత భారంగా మారింది. ఈ వైర‌స్‌ను మ‌ట్టుపెట్టాలంటే భౌతిక‌దూరం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌తే ముందున్న మార్గాలు అవ్వ‌డంతో.. ప్ర‌భుత్వాలు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుడ్ న్యూస్ అందించింది. 

 

ఇప్ప‌టికే బీటెక్ పాసైనవారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 495 ఉద్యోగాలు ఉన్నాయి. సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఇక దరఖాస్తు గడువు 2020 మార్చి 26న ముగిసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును 2020 ఏప్రిల్ 10 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు ఆ గ‌డువు కూడా ముగిసింది. అందుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-NIEIT ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు మ‌రోసారి గ‌డువును పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. 

 

ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 495 పోస్టులు ఉండ‌గా.. అందులో సైంటిస్ట్ బీ 288, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ 207 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే సైంటిస్ట్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్ బీ లెవెల్ లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్స్ లేదా గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఈ, ఎంటెక్ లేదా ఎంఫిల్. 

 

సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీఈ, బీటెక్. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసంhttps://www.calicut.nielit.in/nic/ వెబ్‌సైట్ త‌నికీ చేసుకోవ‌చ్చు.  ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుభవం లేకపోయినా దరఖాస్తు చేయొచ్చు. కాబ‌ట్టి ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థ‌లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: