ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుత‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించి.. ప్రజ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ముఖ్యంగా క‌రోనా దెబ్బ‌కు అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.  దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు త‌గ్గ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి ఎంద‌రో ప్ర‌జ‌ల‌కు పొట్ట‌న పెట్టుకుంది. మ‌రియు ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ సోకి హాస్ప‌ట‌ల్‌లో పోరాడుతున్నారు.

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సదరన్ రైల్వే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. చెన్నై, పెరంబదూర్‌లోని రైల్వే హాస్పిటల్‌లో పారామెడికల్ సిబ్బందిని నియమించనుంది. ఈ ఆస్పత్రిని క‌రోనా పేషెంట్ల కోసం కేటాయించారు. ఈ క్ర‌మంలోనే 197 ఖాళీలను భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. ఇక మొత్తం ఖాళీలు 197 ఉండ‌గా.. అందులో నర్సింగ్ సూపరింటెండెంట్ 110, హాస్పిటల్ అటెండెంట్ 68, హేమో డయాలసిస్ టెక్నీషియన్ 4, ఫిజియోథెరపిస్ట్ 2, స్కిల్డ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 4, రేడియోగ్రాఫర్ 2-4, డైటీషియన్ 2 పోస్టులు ఉన్నాయి.

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 22 లోగా దరఖాస్తు చేయాలి. అంటే దరఖాస్తు చేయడానికి రేపే లాస్ట్ డేట్‌. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభించండి. ఈ నోటిఫికేషన్ గురించి మ‌రిన్ని వివ‌రాల కోసం https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 15
దరఖాస్తుకు చివరే తేదీ- 2020 ఏప్రిల్ 22

మరింత సమాచారం తెలుసుకోండి: