ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే భారత్ లో కూడా గత ముప్పై రోజులగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. మరో పది రోజులు లాక్ డౌన్ కొనసాగుతుంది. 

 

అలాంటి ఈ పరిస్థితుల్లో పరీక్షలు అన్ని కూడా పోస్ట్ పోనే అయ్యింది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులు చక్కబడిన వెంటనే డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రా రెడ్డి తెలిపారు. అది మాత్రమే కాదు.. యూజీ, పీజీ, డిగ్రీ, ఎంసెట్‌ వంటి పరీక్షల నిర్వహణపై ఇప్పుడు ఏలాంటి క్లారిటీ ఇవ్వలేం అని ప్రకటించారు. 

 

అంతేకాదు.. ఇంకా చాలా విషయాలపై అయన క్లారిటీ ఇచ్చారు.. ఆ విషయాలు ఏంటి అంటే? కరోనా పరిస్థితులు చక్కబడగానే మొదట ఫైనలియర్‌ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనుమతి వచ్చిన రెండు మూడు వారాల్లో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన పూర్తయ్యేలా ఇప్పటికే యూనివర్సిటీలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. 

 

డిగ్రీ సెకండియర్‌, ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు కూడా అతి త్వరలో తప్పనిసరిగా నిర్వహిస్తాం అని.. పరీక్షలు ఉండవు డైరెక్ట్ ప్రేమోటే అనే ప్రచారాలు నిజం కావు అని అయన తెలిపారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని అయన తెలిపారు.. అన్ని పరీక్షలు ఉంటాయి అని.. విద్యార్థులు సిద్ధంగా ఉండాలి అని అయన తెలిపారు.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: