ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టుముట్టిన సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాపించి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. దీంతో ప్ర‌జ‌లు క‌రోనా అంటే తీవ్ర భ‌యాందోళ‌కు గుర‌వుతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌డంతో కేంద్రం సైతం ఇప్ప‌టికే దేశంలో లాక్‌డౌన్ విధించింది. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

 

ఇక ఈ క‌రోనా దెబ్బ‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఎన్నో కంపీనీలు మూత‌ప‌డుతున్నాయి. దీంతో ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో  హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉమ్మడి సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్-HRRL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగ‌తి తెలిసిందే.  మొత్తం 72 ఖాళీలను ప్రకటించింది.

 

రాజస్తాన్‌లోని రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది.  ఇంజనీర్, హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీగల్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి.  ఇక మొత్తం 72 ఖాళీలు ఉండగా అందులో ఇంజనీర్- 66, ఫైనాన్స్- 02, హ్యూమన్ రీసోర్స్- 02, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్- 01, లీగల్- 01 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

 

అయితే ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 24 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇలాంటి మంచి ఆవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందో.. ఏమో..? కాబ‌ట్టి.. ఈ నోటిఫికేష‌న్ గురించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తును ప్రారంభించండి. ఇక ఈ నోటిఫికేష‌న్ గురించి పూర్తి వివ‌రాల కోసం  https://www.hrrl.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: