ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఈ వైర‌స్‌ను మ‌ట్టుపెట్టాలంటే కేవ‌లం భౌతిక దూరం, వ్య‌క్త‌గ‌త శుభ్ర‌త పాటించ‌డం వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా లాక్‌డౌన్ విధించాయి. మ‌రియు వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా మిన‌హాయింపు కాదు.

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. మరోసారి గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఇంటింటికీ సేవల్ని అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకం అని భావించిన ఏపీ ప్రభుత్వం, ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10,700 వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. ఇక అందులో గ్రామ వాలంటీర్- 5,200, వార్డు వాలంటీర్- 5,500 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 

 

అభ్యర్థుల వయస్సు 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి రూ.5,000 గౌరవ వేతనం లభిస్తుంది.ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది  2020 ఏప్రిల్ 24. అంతే ఈ ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. కాబ‌ట్టి.. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి.  అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుల పరిశీలన 2020 ఏప్రిల్ 25న జరుగుతుంది. 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఇంటర్వ్యూలు ఉంటాయి. 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎంపికైన వారికి సమాచారం అందుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: