క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 30లక్షలు దాటాయి. ఇక కరోనా వైర‌స్ సోకి మృత్యువాత ప‌డిన‌వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటేసింది. ఇక ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

 

ఎన్నో సంస్థ‌లు మూత ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుని.. రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల నిరుద్యోగులను ఆదుకునేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 93 మేనేజర్ పోస్టుల భర్తీ చేస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

 

ఇక మొత్తం 93 ఖాళీలు ఉండగా మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79, మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04, మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03, మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01 పోస్టులున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లైంది. ఏప్రిల్ 30 ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది. దీనిని బ‌ట్టీ ఇంకా మ‌రో రెండు రోజులు మాత్రమే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల‌ అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేయండి. ఈ నోటిఫికేష‌న్ గురించి మ‌రిన్ని వివ‌రాల కోసం వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి చూడ‌వ‌చ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: