ప్ర‌పంచ‌దేశాల‌ను ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌రోనాను ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌క కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నానా ఇబ్బందులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద‌న్న‌గా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ఇక ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి.

 

ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. అన్ని సంస్థలు మూత‌ప‌డ్డాయి. ఇక ఈ లాక్‌డౌన్ దెబ్బ‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అత‌లాకుత‌లం అయ్యాయి. మ‌రోవైపు అప్పుల భారాన్ని త‌ట్టుకోలేక ప‌లు కంపెనీలు మూత‌ప‌డ‌డంతో ఎంద‌రో ఉద్యోగాల‌ను పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 51 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మే 6 చివరి తేదీ. ఇక మొత్తం 51 పోస్టులు ఉండ‌గా.. అందులో కంటెంట్ డెవలపర్- 1, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ / సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చర్- 3మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 12, నెట్వర్క్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2, మెమొరీ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2, మాల్వేర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2, క్లౌడ్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 4, క్రిప్టో అనలిస్ట్స్- 4, డేటా అనలిస్ట్- 2, మాల్వేర్ రీసెర్చర్- 1, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్- 4 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు ప్రోగ్రామ్ మేనేజర్- 1, సబ్జెక్ట్ మేనేజర్ ఎక్స్‌పర్ట్- 1, సాఫ్ట్‌‌వేర్ డెవలపర్/సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్- 3, సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్- 1,
డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2 పోస్టులు కూడా ఉన్నాయి. విద్యార్భ‌త విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: