తాజాగా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( BECIL ) నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితులను అధికమించి నిరుద్యోగుల కోసం నియమాలు చేపట్టడానికి సిద్ధం అయ్యింది. ఈ తరుణంలో అధికారిక వెబ్ సైట్స్ లో మొబైల్ ఫోరెన్సిక్ నిపుణుడు, మాల్వేర్ ఫోరెన్సిక్ నిపుణుడు, డేటా విశ్లేషకులు ఇంకా ఇతర పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని అధికారికంగా తెలియజేసింది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( BECIL ). ఇక అర్హత గల అభ్యర్థులు స్కాన్ చేసిన పత్రాలను cyberjobs@becil.com ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.


ఇక ఈ పోస్టులు ఢిల్లీ, హైదరాబాదు ఏరియాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అలాగే అర్హత ఆసక్తి గల అభ్యర్థులు మే 6 లోపు రిప్రజెంటేషన్ ఇమేజ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ . ఇక పోస్టుల వివరాలు చూస్తే.. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్లు (ఢిల్లీకి 3 పోస్టులు), సాఫ్ట్‌వేర్ డెవలపర్లు (3 ఢిల్లీకి 3 పోస్టులు), సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ (హైదరాబాద్ కు ఒక పోస్ట్), డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు (ఢిల్లీకి 2 పోస్టులు), కంటెంట్ డెవలపర్ ఒక పోస్ట్ ఢిల్లీలో ఉన్నాయి. ఇక మిగితా పోస్టులు అన్ని ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి.
 
ఇక ఢిల్లీలో జరగబోయే ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తామని నోటిఫికేషన్ లో తెలిపారు. ఇంటర్వ్యూలు ఐటీకి సంబంధించిన విషయాల వాటిపై నైపుణ్య పరీక్ష జరుగుతుంది. ఈ నోటిఫ్ కేషన్ కొరకు పూర్తి వివరాల కోసం బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ని ఓపెన్ చేయడమో లేదా,  https://www.becil.com/uploads/vacancy/9d59e79820bd6958df03425bea3d22d1.pdf ని క్లిక్ చేసి చుడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: