క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తుంది. కంటికి క‌నిపించ‌ని క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి అదుపులోకి రావ‌డంతో లేదు. ఇక ఇప్ప‌టికే క‌రోనాను నియంత్రించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

 

మ‌రికొంద‌రు కంపెనీలు మూత ప‌డి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మయంలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 32 పోస్టులన్నాయి. కంటెంట్ మేనేజర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. అలాగే వీటిలో కొన్ని పోస్టులు హైదరాబాద్‌లో, మరికొన్ని న్యూ ఢిల్లీలో ఉన్నాయి.

 

ఇక పోస్టుల విష‌యానికి వ‌స్తే.. మొత్తం 32 పోస్టులు ఉండ‌గా.. అందులో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (స్కిల్స్ అండ్ లైవ్లీహుడ్స్) / ఇన్నొవేషన్, (ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్)- 2, అసిస్టెంట్ డైరెక్టర్ - 1, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇ-లెర్నింగ్) / టి అండ్ డి - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ట్రైనింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి- 2, అసిస్టెంట్ డైరెక్టర్ / ఎం అండ్ ఇ - 1, స్టేట్ టీమ్ మేనేజర్ / ఎం అండ్ ఇ - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్లు (ఎం అండ్ ఇ) / ఎం అండ్ ఇ - 3, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు / MIS - 3, లీగల్ ఆఫీసర్ / ఎడిఎంఎన్ - 1, మేనేజర్ (హెచ్ఆర్) / అడ్మిన్ - 1 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు ప్రాజెక్ట్ అసోసియేట్ (హెచ్ఆర్ & అడ్మిన్) / అడ్మిన్ - 1, థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ) - 1, థిమాటిక్ (IEC & ICT) - 1, థిమాటిక్ (MIS) - 2, థిమాటిక్ (ఫైనాన్స్) - 1, కంటెంట్ మేనేజర్ - 1, ఆఫీస్ అసిస్టెంట్ - 1, మిషన్ మేనేజర్లు (శిక్షణ & అభివృద్ధి) / టి అండ్ డి- 2 మ‌రియు ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇ-లెర్నింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి - 1 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 23 చివరి తేదీ. మ‌రిన్ని వివ‌రాల కోసం http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో చేసుకుని.. ఇక్క‌డ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

,

 

మరింత సమాచారం తెలుసుకోండి: