ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను అత‌లా‌కుత‌లం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ చివ‌రిలో చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దేశ‌దేశాలు పాకి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  

 

మొత్తం 87 సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ 87 జడ్జి పోస్టుల‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70, ట్రాన్స్‌ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17 ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. అంతేకాకుండా.. కోర్టులో 3 ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇక  దరఖాస్తు గడువు ఏప్రిల్ 13న ముగియాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దరఖాస్తు గడువును పొడిగించింది హైకోర్టు. అభ్యర్థులు 2020 మే 15 వరకు దరఖాస్తు చేయొచ్చు.

 

అలాగే ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది.. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేష‌న్ మ‌రిన్ని వివ‌రాల కోసం  http://tshc.gov.in/ ఓపెన్ చేసి చూసుకోవ‌చ్చు. అలాగే ఆసక్తిగల అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చ‌ల్లించాల్సి ఉంటుంది. ఇక‌ దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఉద్యోగాల‌కు అప్లై చేయండి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: