ఆంధ్ర రాష్ట్రంలో కాలేజీ విద్యార్థుల తల్లితండ్రులకు శుభవార్త అందింది. మనం అనుకోవడం కాదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం జగన్ నిజంగా దేవుడు అని అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అవును మరి.. ఏ రాష్ట్ర సీఎం ఇంత సాయం చేశాడు అండి.. అందరూ కూడా స్వార్థంగా వెనుక ఆస్తి పెంచుకున్నారు తప్ప ఎవరికి మాత్రం సాయం చేశారు చెప్పండి.. సరేలెండి అది పక్కన పెడితే..

 

రాష్ట్రంలోని అన్నీ కాలేజీల యాజమాన్యాలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది అంటే? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది అని.. తల్లిదండ్రుల నుండి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేయాలని.. ఆ డబ్బుని అంత తల్లుల బ్యాంకు ఖాతాల్లో వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. 

 

కరోనా వైరస్ కారణంగా ఆంధ్ర రాష్ట్రము ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్నప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 'నవరత్నాల' హామీల మేరకు ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి 2019–20 విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ సంవత్సరపు విద్యార్థులతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్‌ విద్యార్థులకు కూడా అమలు చేసినట్టు సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. పేద వర్గాల విద్యార్థులు మంచి చదువులు కోసం ఈ కష్టకాలంలో కూడా సాయం చేసినట్టు చెప్పారు.                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: