ఈ కాలం పిల్లలు స్మార్ట్ పిల్లలు.. స్మార్ట్ అంటే చదువులో స్మార్ట్ కాదు.. ఫోన్లు వాడటంలో స్మార్ట్.. చాలా స్మార్ట్. విద్యార్థులు ఎన్నో గేమ్స్ ఆడుతారు.. కష్టపడి చికెన్ డిన్నర్ తింటారు. కానీ స్మార్ట్ గా స్మార్ట్ ఫోన్ లో తింటారు.. అయితే డిగ్రీ విద్యార్థులు అంటే ఈ పనులు చేసిన లైఫ్ లో పెద్ద తేడా ఉండదు కాబట్టి ఇలా చేసిన నో ప్రాబ్లెమ్. 

 

కానీ పదవ తరగతి విద్యార్థులకు  ఇంకా పరీక్షలు కూడా జరగలేదు.. ఇంకా పరీక్షలు జరిగిన.. ఎం సెట్.. జెఈ మెయిన్స్ వంటివి ఇంటర్ పిల్లలకు ఉన్నాయ్ కాబట్టి వారు కాస్త స్మార్ట్ ఫోన్లు పక్కన పెట్టి స్మార్ట్ గా చదవాలి.. లేదు అంటే మంచి ఫలితాలు రావు.. చదువులో పదో తరగతి పిల్లలు.. ఇంటర్ పిల్లలు ఇప్పుడే పుట్టిన పసిపిల్లలు లాంటివారు.. 

 

అందుకే వారిని ఎంతో జాగ్రత్తగా చదివించాలి.. ఈ కరోనా వైరస్ విజృంభణ అనేది ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా పూర్తిగా తగ్గుతుంది.. సో అప్పుడైనా పరీక్షలు జరుగుతాయి.. అందుకే ఇప్పటి నుండే కొన్ని జాగ్రత్తలు.. కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు.. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. చదువుకునే సమయంలో సోషల్ మీడియా వాడకండి.  

 

2. ఫోన్లు సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేసుకోండి.  

 

3. మీకు ఉన్న పనులు ప్రాధాన్యతను గుర్తించండి.  

 

4. అత్యవసరం ముఖ్యమైన పనులు ఏవో తెలుసుకోండి. 

 

5. రోజు ఒకే సమయానికి నిద్ర లేవడానికి అలవాటు పడండి.  

 

6. వారం రోజుల పాటు ఏం చెయ్యాలో ఒక టైం టేబుల్ వేసుకోండి. 

 

7. టైం టేబుల్ లో షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. 

 

ఈ ఏడు నియమాలు పాటిస్తే విజయం సాధిస్తారు.. ఇంకేందుకు ఆలస్యం పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: