కరోనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న ప్రకంపనలు అందరికి తెలిసిందే. మే 17 వరకూ లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో విద్యార్ధుల అకాడమిక్ ఇయర్ దెబ్బతింది. అన్ని దేశాలలో స్కూళ్ళు, కాలేజీలు,యూనివర్సిటీలకి సెలవులు ప్రకటించారు. కొన్ని విద్యా సంస్థలు ఆన్లైన్ లో ఇంటి వద్ద ఉండే తమ విద్యార్ధులకి క్లాసులు చెప్తున్నాయి. ఎంతో మంది విదేశాలలో ఉండే విద్యార్ధులు భారత్ లో చిక్కుకు పోవడంతో వారి పరిస్థ్తీ మరీ దారుణంగా తయారయ్యింది. ఒక పక్క క్యాంపస్ ఇంటర్వ్యూ లు ఉన్న తరుణంలో భారత్ లోనే చిక్కుకు పోవడంతో ఆందోళన చెందుతున్నారు..

 

ఇదిలాఉంటే కరోనా సోకినా విద్యార్ధుల పరిస్థితి మరీ దారుణం వారి విద్య సంవసత్సరంపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఎంతో మంది విద్యార్ధులు,విద్యార్ధుల తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గాంధీ నగర్ కరోనా సోకినా విద్యార్ధులకి భంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

ఐఐటీ గాంధీనగర్ ఒక సంవసత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లోమో కార్యక్రమాని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా సోకినా విద్యార్ధులకి  ప్రత్యక్ష ప్రవేశాని ఆఫర్ చేస్తోంది. కరోనా సోకినా వారికి సమయం వృధా కాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లోమో ప్రత్యేకంగా కెమికల్ ఇంజనీరింగ్..సివిల్ ఇంజనీరింగ్..కంప్యూటర్ సైన్స్..ఎర్త్ సిస్టమ్ సైన్స్..బయోలాజికల్ ఇంజనీరింగ్  వంటి అనేక విషయాలలో ఉంటుంది..

 

ఈ కోర్సు చేసిన విద్యార్ధులు తదుపరి MTech ప్రోగ్రామ్ లో ఎంట్రీ పొందే అవకాశాలు ఉన్నాయి. కరోన మహమ్మారి కారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్  ప్రణాళికలో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకి ఇది ఎంతో మంచి అవకాశమని తెలిపింది. ఈ కోర్సు గురించి ప్రకటించిన ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ కోర్సు కేవలం ఈ ఒక్క ఏడాదికి మాత్రమేనని తెలిపారు. ఈ కోర్సు వలన విద్యార్ధులు వారి వారి వృత్తిని చివరి వరకూ కొనసాగించడానికి అవకాశం ఇస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: