ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అగ్ర‌రాజ్యాలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద‌న్న‌గా చెప్పుకునే అమెరికా క‌రోనా దెబ్బ‌కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాగే స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లోనూ కరోనా విజృంభ‌ణ‌ తీవ్రతరంగా ఉంది. ఇక ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. మ‌రోవైపు ఈ క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతోంది. ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ల‌న్నీ క‌రోనా దెబ్బ‌కు కుప్ప‌కూలాయి.

 

ఇక కరోనా వైరస్ సంక్షోభం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 కూడా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా.. టీఎస్ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తు గడువును 2020 మే 15 వరకు పొడిగించింది. అంటే ద‌ర‌ఖాస్తుకు మ‌రో మూడు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. అలాగే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మ‌రియు కనీసం 50% మార్కులతో పాస్ కావాలి. బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారికీ అవకాశం ఉంది. 

 

సైన్స్, మ్యాథ్స్ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 55% మార్కులతో పాస్ అవ్వాలి. ఇక టీఎస్‌ఎడ్ సెట్ 2020 పరీక్షకు అప్లై చేసే అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. అదేవిధంగా, ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటికి కనీసం 19 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ విద్యార్థులకు రూ.650 నిర్ణ‌యించ‌గా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450 చ‌ల్లించాలి. కాగా, 2020 మే 23న జరగాల్సిన టీఎస్ఎడ్‌సెట్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పరీక్ష తేదీని ఉస్మానియా విశ్వవిద్యాలయం త్వరలో ప్రకటించనుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: