ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ్మారిటి ధాటికి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రూ భ‌యంభ‌యంగా ఉంటున్నారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వ‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇదే క్ర‌మంలోనే క‌రోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మయంలో బీటెక్ పాసైనవారి అందింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తూ.. ఇటీవ‌ల ఓ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ సంగ‌తి తెలిసిందే.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 259 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో వీరిని నియమించనుంది ఎన్ఎల్‌సీ. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది. జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ ఉండాలి. 

 

ఇక మొత్తం 259 ఖాళీలు ఉండగా అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభమైంది. 2020 మే 17 లోగా దరఖాస్తుకు చివ‌రి తేది. అంటే.. రేపు ఒక్క‌రోజు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి.. అర్హులు ఆస‌క్తి  ఉంటే.. వెంట‌నే ద‌ర‌కాస్తు చేసుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: