మనం ఒకటి కాదు రెండు కాదు చిన్నప్పటి నుండి.. అంటే మనకు మూడేళ్ళ వయసు నుండి 23 ఏళ్ళ వయసు వరుకు చదువుతూనే ఉంటాం. కానీ ఉద్యోగం రాదు. అదేంటో మరి.. కేవలం అంటే కేవలం మూడు నెలలు కోర్స్ చేస్తే చాలు ఉద్యోగం వస్తుంది.. దాన్నే ఎడ్యుకేషన్ అని అంటారు. ఇంకా ఆ చదువు చదివి ఇంట్లో కూర్చున్నవాడికి కోపం రాదు.. కానీ మళ్లీ మూడు నెలలు కోర్సు చేసి ఉద్యోగం చేస్తాడు చూడు.. అలాంటి వాళ్ళకి ఎందుకు ఈ ఎడ్యుకేషన్ అని చిరాకు వస్తుంది. జీవితం అంటేనే చిరాకు పుడుతుంది. 

 

ఇంకా ఆలా ఉద్యోగం, ఉపాధికి పనికిరాని చదువులు ఎందుకంటూ తిట్టుకునే రోజులు ఇప్పుడు ఉండవు అని అంటుంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. మనం చదివే చదువు ఉపాధికి అవసరం అయ్యేలా ఉండకూడదు అని.. కోర్సులు అందుబాటులోకి తీసుకురానుంది ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌. ఒక్కసారిగా అన్ని కోర్సుల సబ్జెక్టులను మార్చకుండా నెమ్మది నెమ్మదిగా పాతబడిన కోర్సుల స్థానంలో పరిశ్రమలు, ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 

 

ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పనులు ప్రారంభించింది. కొత్త విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ విద్యలో ఈ మార్పులను ప్రారంభించాలని నిర్ణయించారు.మూడేళ్ళ డిగ్రీ కోర్సుల సిలబస్ లో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా అప్రెంటిస్‌షిప్‌ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి జత చేశారు. ఈ మేరకు మర్చి కొత్త పాఠ్య పుస్తకాలు జూన్ నాటికీ అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ కోర్సులు ఏంటి అనేది చూడాలి.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: