ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి. ఈ ప్ర‌పంచంపై క‌రోనా దాడి ప్రారంభించి నెల‌లు గ‌డుస్తున్నా.. దీని దూకుడు త‌గ్గ‌డం లేదు. ఇక భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అలాగే క‌రోనా కాటుకు బ‌లైన వారి సంఖ్య మూడు వేలు దాటింది. ఇక ప్ర‌స్తుతం ఇక్క‌డ క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో పలు ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెంపరరీ టెక్నికల్ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 12 పోస్టుల్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్టుల్లో వీరిని నియమిస్తోంది. ఇక మొత్తం 12 ఖాళీలు ఉండగా హైకోర్టులో 4 పోస్టులున్నాయి. హైకోర్టులో సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ (సాఫ్ట్‌వేర్)- 1, సిస్టమ్ అసిస్టెంట్ (హార్డ్‌వేర్)- 2, సిస్టమ్ ఆఫీసర్- 1 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

 

అలాగే సబార్డినేట్ కోర్టులో 8 పోస్టులున్నాయి. ఇందులో సిస్టమ్ ఆఫీసర్- 2, సిస్టమ్ అసిస్టెంట్- 6 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వేతనాల వివరాలు చూస్తే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్‌కు రూ.40,000, సిస్టమ్ ఆఫీసర్‌కు రూ.35,000, సిస్టమ్ అసిస్టెంట్‌కు రూ.25,000 వేతనం లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టాట్ అయింది. దరఖాస్తు చేయడానికి 2020 మే 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: