క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముందున్న అతి పెద్ద స‌మ‌స్య‌. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ క‌రోనా.. మ‌న‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. ఇక  ప్ర‌స్తుతం క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనాతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 32 పోస్టులన్నాయి. కంటెంట్ మేనేజర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 23 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఇక మొత్తం 32 పోస్టులు ఉండ‌గా.. అందులో అసిస్టెంట్ డైరెక్టర్, పెడగాగి / T&D - 1, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (స్కిల్స్ అండ్ లైవ్లీహుడ్స్) / ఇన్నొవేషన్, (ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్)- 2, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇ-లెర్నింగ్) / టి అండ్ డి - 1, మిషన్ మేనేజర్లు (శిక్షణ & అభివృద్ధి) / టి అండ్ డి- 2, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇ-లెర్నింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ట్రైనింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి- 2, అసిస్టెంట్ డైరెక్టర్ / ఎం అండ్ ఇ - 1 పోస్టులున్నాయి. 

 

అలాగే వీటితో పాటు  స్టేట్ టీమ్ మేనేజర్ / ఎం అండ్ ఇ - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్లు (ఎం అండ్ ఇ) / ఎం అండ్ ఇ - 3, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు / MIS - 3, లీగల్ ఆఫీసర్ / ఎడిఎంఎన్ - 1, మేనేజర్ (హెచ్ఆర్) / అడ్మిన్ - 1, ప్రాజెక్ట్ అసోసియేట్ (హెచ్ఆర్ & అడ్మిన్) / అడ్మిన్ - 1, థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ) - 1, థిమాటిక్ (IEC & ICT) - 1, థిమాటిక్ (MIS) - 2, థిమాటిక్ (ఫైనాన్స్) - 1, ఆఫీస్ అసిస్టెంట్ - 1, కంటెంట్ మేనేజర్ - 1 పోస్టులు కూడా ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక ఈ పోస్టుల్లో కొన్ని పోస్టులు హైదరాబాద్‌లో, మరికొన్ని న్యూ ఢిల్లీలో ఉన్నాయి. అయిదే ద‌ర‌ఖాస్తు మ‌రో రెండు రోజులే ఉంది కాబ‌ట్టి.. వెంట‌నే ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. ఇదే వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: