ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. దీంతో ఎన్నో కుటుంబాలు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాయి. ఇక ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మ‌రోవైపు అన్ని రంగాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మంది ఉద్యోగుల ఉసురుపోసుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా నష్టాల్లో కూరుకుపోతున్న ప్రైవేటు సంస్ధలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుకు ఒక్కొక్కటిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

 

అయితే ఇలాంటి స‌మయంలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది యురేనియం కార్పొరేషన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 136 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేట్ ట్రెయినీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు జూన్‌ 22, 2020 చివరి తేదీ. 

 

మొత్తం 136 ఖాళీలు ఉండ‌గా.. అందులో గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ (కెమికల్)- 4 మైనింగ్ మేట్ సీ- 52 బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ ఏ- 3 వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ- 14బ్లాస్టర్ బీ- 4 అప్రెంటీస్ (మైనింగ్ మేట్)- 53 అప్రెంటీస్ (ల్యాబరేటరీ అసిస్టెంట్)- 6 ఉన్నాయి. ఇక పోస్టులను బట్టి ఇంటర్మీడియట్‌, మెట్రిక్యులేషన్‌, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.  ఈ పోస్టుల‌కు కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://www.ucil.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: