కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డారు.. అందులో కొన్ని లక్షల మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు. దీంతో గత రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఇంకేముంది.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. 

 

చిన్న పెద్ద.. ఉద్యోగం, బిజినెస్ ఏం లేవు.. అన్ని కూడా ఈ కరోనా వైరస్ ముందు తోక ముడిచాయి. ఇలా అన్ని ఎక్కడికి అక్కడ ఆగిపోవడంతో విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు అన్ని మూసేశారు. దీంతో పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా వేసవి సెలవలు ముందుగానే వచ్చాయి. ఇంకా అలానే పది పరీక్షలు, వార్షిక, ప్రవేశ పరీక్షలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. 

 

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొన్ని కొన్ని సడలింపు ఇచ్చారు. ఇంకా అలానే వాయిదా పడిన అన్ని వార్షిక, ప్రవేశ పరీక్షలకు సంబంధించి తేదీలను, షెడ్యూల్స్ ని ఆ విభాగాలు ప్రకటించాయి. దీంతో పరీక్షా తేదీలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మార్గదర్శకాలు జారీ చేశాయ్. 

 

ఇంకా అందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఇకపై ముఖానికి మాస్కు..చేతులకు గ్లౌజులు ధరించి వస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలి అని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అలాగే జాతీయస్థాయిలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఎయిమ్స్‌ నిపుణులు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. చిన్న శానిటైజర్‌ బాటిల్‌, వాటర్‌ బాటిల్‌ను సైతం ఎంసెట్‌తో పాటు ఇతర అన్ని ఆన్‌లైన్‌ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: