ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారికి క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు. ఇక క‌రోనా దెబ్బ అన్ని రంగాల‌పై పండింది. ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా తీవ్ర దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే బీటెక్ అర్హ‌త‌తో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేస్తోంది. 

 

దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈ సంస్థ. మొత్తం 259 ఖాళీలు ఉండగా అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. విద్యార్హత వివరాలు చూస్తే సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది.

 

అలాగే  జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ లో తెలుసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎప్పుడు ప్రారంభ‌మైంది. 2020 మే 30 ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది. అంటే మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: