ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి కారణం ముఖ్యంగా డబ్బున్న వారికి మాత్రమే పీజీ వైద్య సొంతం కాకూడదనే ఉద్దేశంతోనే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ కోటా, కన్వీనర్ కోట అన్నింటిలోనూ పిజి కోర్స్ ఫీజులను తగ్గించింది. ఇలా తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 2020 - 21 నుంచి 2022 - 2023 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

 

IHG


ఇక ఇందులో మైనారిటీ, నాన్ మైనారిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు అన్నింటిలో కూడా ఒకే తరహా ఫీజులు ఉండబోతున్నాయి. ఇక ఈ దెబ్బతో దాదాపు అన్ని కేటగిరిలోని ఫీజులు సగానికి పైగా తగ్గిపోతున్నాయి. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల ఉత్తర్వులు మేరకు పీజీ వైద్య విద్య సీట్లు భర్తీ లో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరో జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

 


ఇకపోతే ఇందులో కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అందులో ఆంధ్రప్రదేశ్ ఫీ కమిటీ ప్రతిపాదించిన మేరకే ఫీజులు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రజల కంటే ఎక్కువ వసూలు చేస్తే అలా చేసిన కాలేజీ యాజమాన్యానికి కఠిన చర్యలు మాత్రం తప్పవు. ఇక వార్షిక ఫీజు మాత్రం కాలేజీ యాజమాన్యాలు రెండు పర్యాయాలుగా వసూలు చేసుకోవచ్చు. ఫీజుల వసూళ్లపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంది. ఇక చివరగా ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థులకు వస్తున్న స్టైఫండ్ ప్రైవేట్ కాలేజీలో కూడా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: