కరోనా వైరస్ కారణంగా అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇంకా చదువుకునే పిల్లల పరిస్థితి కూడా అలానే ఉంది. ఎప్పుడో ఏప్రిల్ చివరిలో జరగాల్సిన పరీక్షలు అన్ని కూడా జులైకి వాయిదా పడ్డాయి. పదవ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు ఇలా అన్ని వాయిదా పడుతూ వచ్చాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఎంట్రెన్స్ పరీక్షలు అన్ని కూడా వాయిదాలు పడ్డాయి. దీంతో ఇప్పుడు అన్ని కూడా ఒకటి తరువాత ఒకటి పరీక్షలు జరుగుతున్నాయి. 

 

IHG

 

అలానే తెలంగాణలో ఐటీఐ విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే ''ఎల్‌పీసెట్‌''ను జూలై 5 నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. అయితే ఈ పరీక్షా దరఖాస్తుల గడువును జూన్ 9 వరకు పొడిగించింది. ఈ పరీక్ష జులై 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరపాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి నిర్ణయించింది. 

 

IHG

 

ఈ పరీక్షకు జూన్‌ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంకా అప్పటికి దరఖాస్తు చేసుకొని వారు లెట్ ఫిజ్ తో జూన్ 12 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని సంచాలకుడు మూర్తి పేర్కొన్నారు. కాగా ఈ పరీక్షలలనే పాలిటెక్నిక్‌ కోర్సుల్లోకి చేరేందుకు పాలిసెట్‌ దరఖాస్తులను జూన్‌ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని లెట్ పేజ్ తో 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా ఈ ప్రవేశ పరీక్ష జూలై 1న జరగనుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: