చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 213 దేశాలు వ్యాప్తిచెందిన క‌రోనా ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. అదే స‌మ‌యంలో క‌రోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్- ఐఓసీఎల్.. ఈస్టర్న్ రీజియన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 404 పోస్టుల్ని భ‌ర్తీ చేస్తోంది. అందులో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఇక ఈ నోటిఫికేష‌న్ మ‌రిన్ని వివ‌రాల కోసం https://www.iocl.com/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో ఖాళీల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. మొత్తం ఖాళీలు 404 ఉండ‌గా.. అందులో టెక్నీషియన్ అప్రెంటీస్- 221, ట్రేడ్ అప్రెంటీస్- 168, 
ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)- 15 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. అయితే ఏడాది అనుభవం ఉన్నవారు, ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేయకూడదు. అలాగే ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఇక 2020 మే 29 నుండి ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రారంభం కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 జూన్ 18. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: