లాక్ డౌన్ కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్ లు..నిర్వహించాల్సిన పరీక్షలు అన్నీ కొంత కాలం వాయిదా పడ్డాయి. దాంతో నిరుద్యోగులకి పోటీ పరీక్షలకి సిద్దమవ్వడానికి మరింత సమయం దొరకడంతో ఇప్పుడు  వరుస నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఖాళీలని  భర్తీ చేస్తోంది.

IHG

 మొత్తం 617 ఉద్యోగాలతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలెట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ /టైపిస్ట్ , సీనియర్  క్లర్క్ /టైపిస్ట్ వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ గతంలోనే ప్రకటించారు దరఖాస్తు గడువు కూడా ఏప్రియల్ 23 తో ముగిసి పోయింది. కరోనా కారణంగా వాయిదా పడటంతో తాజాగా మరో మారు కొన్ని పోస్టులని కలిపి మరో మారు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 

మొత్తం ఖాళీలు : 617

అసిస్టెంట్ లోకో పైలెట్ : 324

కమర్షియల్ కమ్ టిక్కెట్ కలక్టర్ : 63

జూనియర్ క్లర్క్ /టైపిస్ట్ : 68

సీనియర్  క్లర్క్ /టైపిస్ట్ : 70

సీనియర్ కమర్షియల్ కమ్ టిక్కెట్ కలక్టర్ : 84

జేఈ : 3

జేఈ వర్క్స్ : 2

జేఈ సిగ్నల్  : 1

జేఈ టెలీ  : 1

 

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24-04 -2020

దరఖాస్తు చివరి తేదీ : 23- 06- 2020

 

విద్యార్హతలు : నోటిఫికేషన్ లో ఇచ్చిన ఖాళీల ప్రకారం ఉద్యోగానికి సంభందించి వివిధ రకాలుగా అర్హతలు ప్రకటించారు. నోటిఫికేషన్ కి చెందిన లింక్ మీకు క్రింద ఇవ్వబడుతుంది. అందులో సంచారం సేకరించ గలరు.

 ముఖ్యమైన లింక్స్

https://www.rrcser.co.in/pdf/New%20Doc%202020-03-20-10.48.17.pdf

https://appr-recruit.co.in/

 

మరింత సమాచారం తెలుసుకోండి: