ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఎంద‌రో ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. మ‌రోవైపు కరోనా వైరస్ ప్రభావంతో అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి. ప్రాజెక్టులు లేక కొత్తవి రాకపోవడంతో కంపెనీలు తమ ఖర్చుల తగ్గించుకునే పనిలోపడ్డాయి. కొన్ని కంపెనీలు జీతాలు తగ్గిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను కుదిస్తున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ.

 

విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.  అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఇక ఈ నోటిఫికేష‌న్ గురించి మ‌రిన్ని వివ‌రాల కోసం  http://careers.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. మ‌రియు ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్తులు ఈ వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అలాగే ఈ ఉద్యోగాల‌కు 23,000 వేత‌నం నిర్ణ‌యించారు. ఇక‌ ఈ పోస్టుల‌కు 2020 జూన్ 1 దరఖాస్తు ప్రారంభం కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటలు వ‌ర‌కు ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: