ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రు నివార‌ణ‌పైనే దృష్టి పెట్టారు. మ‌రియు ఈ క‌రోనా వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. మ‌రోవైపు  కరోనా వైరస్ ఆ రంగం ఈ రంగం అని కాదు అన్ని రంగాలపైనా తన ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారిఎఫెక్ట్‌తో ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

 

ఇక కొందరు ఉద్యోగులు సగం జీతానికే పనిచేస్తుంటే.. మ‌రికొంద‌రు ఉద్యోగం పోగొట్టుకుని నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో ఈ పోస్టులున్నాయి.

 

ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 17 ఖాళీలు ఉండ‌గా.. అందులో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1, మేనేజర్- 1, ఆఫీసర్- 4, అసిస్టెంట్- 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైంది. మ‌రియు ఈ పోస్టుల దరఖాస్తుకు 2020 జూన్ 18 చివరి తేదీ. ఇక ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే దరఖాస్తు ఫీజు రూ.500 చ‌ల్లించాల్సి ఉంటుంది. మ‌రియు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.airindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: