కరోనా వైరస్.. అందరికి టెక్నాలజీ పవర్ ఏంటో చెప్పింది. ఇంకా ప్రస్తుత యుగం టెక్నాలజీ యుగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పిల్లలకు చదువులు స్మార్ట్ ఫోన్ నుండే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు అంత కూడా  టెక్నాలజీనే. ఇంకా ఈ నేపథ్యంలోనే తేలానగన్ ఇంటర్ విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ని ముంద్రించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. 

 

తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, తెలుగు అకాడమీ అధికారులతో చర్చించనున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌తో కూడిన పుస్తకాలు 2021-2022 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. కాగా ఎన్‌సీఈఆర్‌టీ 8, 9 తరగతులకు సంబంధించి ప్రధాన సబ్జెక్టుల పుస్తకాలను క్యూఆర్ కోడ్ విధానంలో ముద్రించారు. 

 

అందుకు గాను ఎన్‌సీఈఆఆర్‌టీ అధికారులతో ఇంటర్ బోర్డు అధికారులు చర్చించనున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సబ్జెక్టుల్లో అవసరమైన చోట ఈ క్యూర్ కోడ్ ని ముద్రిస్తారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఈ కోడ్ ని స్కాన్ చేస్తే ఎక్కువ సమాచారం, పాఠంకు సంబందించిన వీడియోలు, ఫోటోలు ఫోన్ లోకి వస్తాయి.. దీని వాళ్ళ విద్యార్థులు పాఠంను మరింత ఈజీహా అర్ధం చేసుకుంటారు. 

 

ఇంకా ఈ క్యూర్ కోడ్ పరీక్షల సమయంలో మరింత ఉపయోగ పడుతుంది. పాఠాలు వినడం మర్చిపోయిన.. అందుకు సంబంధించిన వీడియోలు చూడటం వాళ్ళ పాఠం అర్ధం అవుతుంది.  చూసారుగా ఎన్ని లాభాలు ఉన్నాయో.. క్యూర్ కోడ్ వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: