గడించిన కొంత కాలంగా కరోనా ధాటికి అన్ని రాష్ట్రాలలో ఉద్యోగ నియామకాలు పెండింగ్ లో పడ్డాయి. దాంతో అప్పటి వరకూ పోటీ పరీక్షలకి సిద్దమవుతూ వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర నిరాశకి లోనయ్యారు. దాంతో దొరికిన ఖాళీ సమయాన్ని తదుపరి వచ్చే నోటిఫికేషన్ కోసం ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ లు విడుదల అవుతాయోనని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఈసిఐఎల్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

IHG

ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు టెక్నికల్ పోస్టులని భర్తీ చేస్తోంది. అంతేకాదు మొత్తం రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం రెండు నోటిఫికేషన్ ల ద్వారా 82 పోస్టులని భర్తీ చేయనుంది. అయితే మొదటి నోటిఫికేషన్ ద్వారా 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టులకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 4 న మొదలు కాగా జూన్ 11 న సాయంత్రం 4 గంటలకి ముగియనుంది.

IHG

ఈ పోస్టులకి ఆసక్తి గల అభ్యర్ధులు  http://careers.ecil.co.in/   ద్వారా అప్ప్లై చేసుకోవచ్చు. ఇదిలాఉంటే మరొక నోటిఫికేషన్ ద్వారా 12 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు  జూన్ 22 సాయంత్రం 4 లోగా అప్ప్లై చేసుకోవాలి. ఈ పోస్టులను కూడా http://careers.ecil.co.in/ ద్వారా అప్ప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి అర్హతలు గా కంప్యూటర్ సైన్స్ లో సుమారు 60 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. ఏడాది పాటు అనుభవం తప్పనిసరి, ఈ ఉద్యోగాలకి ఎంపిక కాబడిన వారికి వేతనం రూ. 23,000 ఉంటుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది.  ఇంటర్వ్యూ లు హైదరాబాద్ లోని ఈసిఐఎల్ కార్యాలయంలో జరుగుతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: