ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలను క‌రోనా వైర‌స్ ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. లాక్‌డౌన్ విధించినా.. కరోనా కేసుల పెరుగుదలలో ఏ మాత్రం తగ్గుదల లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. మ‌రోవైపు  కరోనా వైరస్ ఆ రంగం ఈ రంగం అని కాదు అన్ని రంగాలపైనా తన ప్రభావం చూపుతోంది. 

 

కరోనా మహమ్మారిఎఫెక్ట్‌తో ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తోంది. డైరెక్టర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక 2020 జూన్ 11 దరఖాస్తుకుచివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 10 ఖాళీలు ఉండ‌గా.. అందులో డైరెక్టర్- 1, రిజిస్ట్రార్ (కంప్యూటర్ డివిజన్)- 1, డిప్యూటీ రిజిస్ట్రార్- 7, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి.

 

ఈ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చ‌ల్లించాల్సిన ప‌ని లేదు. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://ignou.ac.in/ లేదా https://ignourec.samarth.edu.in/ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుకు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది కాబ‌ట్టి.. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: