ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం మ‌రింత క‌ష్టంగా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు క‌రోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ,  రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నారు. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి.

 

 మ‌రోవైపు ఉద్యోగుల‌పై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలూ కుదేలయ్యాయి. ఈ క్ర‌మంలోనే నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్ట‌డంతో పాటు.. ఉద్యోగులను సైతం తొలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 23 ఖాళీలున్నాయి. హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్, ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్), హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఇవి మూడేళ్ల పోస్టులు మాత్రమే. 

 

ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 23 ఖాళీలు ఉండ‌గా.. అందులో హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్- 1, ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్)- 1, ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP)- 2, హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్- 1 మ‌రియు అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్- 18 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://open.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: