ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. అదే స‌మ‌యంలో ఎంద‌రికో ఈ వ్యాధి సోకి హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారి రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇస్రో గుడ్‌న్యూస్ చెప్పింది.

 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO గతంలో 55 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు గతంలోనే ముగిసింది. అయితే క‌రోనా క‌ష్టకాలంలో దరఖాస్తు చేయని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు దరఖాస్తు లింక్‌ను మరోసారి యాక్టివేట్ చేసింది ఇస్రో. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 55 సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టులున్నాయి. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఇక మొత్తం 55  ఖాళీలు ఉండ‌గా.. అందులో సైంటిస్ట్ / ఇంజనీర్- 21, టెక్నికల్ అసిస్టెంట్- 6 మ‌రియు టెక్నీషియన్ బీ - 28 ఖాళీలు ఉన్నాయి. 

 

టెక్నీషియన్ బీ(28)లో.. ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ ఉండాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: