ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండవం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనా దేశం వుహాన్ న‌గ‌రంలో పుట్టి ప్ర‌పంచ‌దేశాల‌కు ఉమ్మ‌డి శ‌త్రువుగా మారింది క‌రోనా. మూడక్షరాల కరోనా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. క‌రోనా రోజురోజుకు విజృంభిస్తూనే వ‌స్తోంది. ఈ వైరస్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ఇంతవరకు ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి. మ‌రోవైపు క‌రోనా ప్ర‌భావం ఉద్యోగుల‌పై కూడా చూపుతోంది.

 

క‌రోనా కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప‌లు కంపెనీలు ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డానికి త‌మ ఉద్యోగుల‌ను పీకేస్తుండ‌గా.. మ‌రోవైపు ఎన్నో కంపెనీలు క‌రోనా దెబ్బ‌కు మూత‌ప‌డ‌డంతో కొంద‌రు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 141 పోస్టులు ఉన్నాయి.  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. 

 

ఇందులో మొత్తం మొత్తం  141 ఖాళీలు ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 20, అడిషనల్ ప్రొఫెసర్- 22, అసోసియేట్ ప్రొఫెసర్- 34 మ‌రియు అసిస్టెంట్ ప్రొఫెసర్- 65 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో 141 పోస్టుల్ని భర్తీ చేయనుంది జిప్‌మర్. విద్యార్హతలు విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎప్పుడో మొద‌లైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ 2020 జూలై 24 సాయంత్రం 5 గంటలు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు, ఇమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది. ఇక‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: