మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత యోగా గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. యోగాను  దైనందిక కార్యక్రమాలలో భాగం చేసుకుంటే  అనారోగ్య సమస్యలు తలెత్తవు అనే విషయం దాదాపు ప్రపంచానికి తెలిసింది. దాంతో యోగాకి ఫుల్ డిమాండ్  ఏర్పడింది. ఎంతో మంది విదేశీయులు భారత్ వచ్చి ఇక్కడ యోగా అభ్యసించి వెళ్తున్నారు. యోగాని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21 న ఓ పండుగలా జరుపుకుంటున్నారు.  అయితే ఈ నెల 21 న ప్రపంచం మొత్తం 6వ ఇంటర్నేషనల్ యోగా డే కి సిద్దమవుతోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా భారత ప్రభుత్వం ఈ యోగాడే ని బహిరంగంగా నిరహించ కూడదని తెలిపింది. ఎక్కడి వారు అక్కడే ఉంటూ యోగా చేసుకోవాలని తెలిపింది..

IHG

ఈ క్రమంలోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిలేషన్ కలిసి జీవన్ యోగా పేరుతో ఓ వీడియో బ్లాగిన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. యోగా పట్ల అవగాహన్ పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆశక్తి గలవారు ఎవరైనా సరే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టగ్రామ్ వంటి సోషల్ మీడియా సాధనాలలో ఫాలో కావచ్చని తెలిపింది. అలాగే ఈ కాంటెస్ట్ లో ప్రపంచంలోని అన్ని దేశాల వారు పాల్గొన వచ్చని ప్రకటించింది.

ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలనుకునే వారు https://mylifemyyoga2020.com/ వెబ్ సైట్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవాలి, పాల్గొనే వారు మూడు నిమిషాల పాటు యోగా చేస్తున్న మీ వీడియోని చిత్రీకతించాలి, అవి ఎలాంటి బాషలో అయినా ఉండచ్చు, #MyLifeMyYoga పేరుతో ఇంస్టా గ్రామ, face book, ట్విట్టర్ లలో అప్లోడ్ చేయాలి, ఆ తరువాత కేంద్ర ఆయుష్ శాఖ కి చెందిన పేజ్ ని లైకే చేయాలి , ఈ కాంటెస్ట్ లో గెలుపు ఓటములని ఈ శాఖ పరిశీలిస్తుంది, గెలిచినా వారికి మొదటి బహుమతిగా రూ. 100,000/- రెండవ బహుమతిగా రూ. 50,000 మూడవ బహుమతి రూ. 25,000 గా నిర్ణయించారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: