ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా దేశ‌దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్ మారింది. ఎప్పుడు.. ఎలా.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మ‌రోవైపు ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాల ప‌రిశోధ‌కులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే.. క‌రోనా ప్ర‌భావం ఉద్యోగుల‌పై తీవ్రంగా ప‌డింద‌ని చెప్పొచ్చు. క‌రోనా కార‌ణంగా న‌ష్టాలు ఎదుర్కొంటున్న ప‌లు కంపెనీలు ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి త‌మ ఉద్యోగులు ఇంటికి సాగ‌నంపుతున్నారు. దీంతో స‌ద‌రు ఉద్యోగులు నిరుద్యోగులుగా మారి రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్-CSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 79 ఖాళీలను ప్రకటించింది. సైంటిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

 

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 17 చివరి తేదీ. ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 79 ఖాళీలు ఉండ‌గా.. అందులో సైంటిస్ట్ బీ- 59, సైంటిస్ట్ బీ CSTRI - 15, సైంటిస్ట్ సీ- 3 మ‌రియు అసిస్టెంట్- 2 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 2020 జూలై 17 చివరి తేదీ. దరఖాస్తుల్ని చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://csb.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: