ముక్కూ చెవులూ కోసినా ముందటి మొగుడే కాస్త నయం అంటూ.. ఓ మోటు సామెత ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పరిస్థితి అలాగే ఉంది. ఆయన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నిరంతరం ఆయన పాలనను తన రాతలతో ఎండగట్టేవారు. వైఎస్ అంతటి ఫ్యాక్షనిస్టు లేడు అన్నట్టుగా ఆయన రాతలు సాగేవి. వైఎస్‌ ది అరాచక పాలన అంటూ తన ఫేవరేట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబుతో కలసి గగ్గోలు పెడుతూ ఉండేవారు.

 

 

కాలం మారిపోయింది. ఓ పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వైఎస్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ పాలన చూస్తుంటే.. ఆ పరమ ఫ్యాక్షనిస్టు.. నియంత అయిన వైఎస్సారే చాలా బెటర్ అనిపిస్తోందట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు. ఎందుకు అంతగా అనిపిస్తోందంటే.. తనకూ తన ఫేవరేట్ పొలిటిషియన్ చంద్రబాబుకు అమితంగా ఇష్టమైన అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నందుకట.

 

IHG

 

జగన్ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరోసారి రాధాకృష్ణ అమరావతి భవిష్యత్తు తలచుకుని కుమిలిపోయారు. పైసా ఖర్చు లేకుండా సమకూరిన 50 వేల ఎకరాల భూమిని, పది వేల కోట్ల రూపాయలతో జరిగిన నిర్మాణాలను దయ్యాల కొంపలుగా మార్చి.. 500 కోట్లతో మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకోవడం హాస్యాస్పదం కాదా? అంటూ ప్రశ్నించారు. యేటా 500 లేదా వెయ్యి కోట్లు కేటాయించినా నాలుగేళ్లలో 4 వేల కోట్లతో మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయనడం ఆత్మవంచన కాదా? అని నిలదీశారు.

 

 

సామాజికవర్గాల మధ్య ద్వేషాన్ని రగిలించి అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశమున్న అమరావతిని ఎడారిగా మార్చివేయడం విజన్‌ అనిపించుకుంటుందా ? జగన్‌ స్థానంలో రాజశేఖర్‌రెడ్డి ఉండి వుంటే అమరావతిని మహానగరంగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి ఉండేవారు.. అంటూ వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. ఆయన బతికి ఉండగా ఏనాడూ మెచ్చుకుని ఎరగని వారికి ఇప్పుడు వైఎస్ ఓ మహానుభావుడుగా కనిపించడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: